New beaches to be developed by Greater Visakhapatnam Municipal Corporation before global investors summit
mictv telugu

vishaka: విశాఖలో కొత్త అందాలు.. మెరిసిపోతున్న సాగర తీరం

February 28, 2023

New beaches to be developed by Greater Visakhapatnam Municipal Corporation before global investors summit

తెలుగు రాష్ట్రాల్లో అందమై ప్రదేశం సాగర తీరం విశాఖ. నగరంలోని బీచ్‌లు దేశ, విదేశీ పర్యాటకులను ఎంతోగానో ఆకర్షిస్తాయి. ఏటా అధిక సంఖ్యలో విశాఖ సందర్శనకు వచ్చి సాగరతీరాన సేదతీరుతుంటారు. పర్యటకులను మరింత ఆకట్టుకునే విధంగా విశాఖ నగరాన్ని, బీచ్‌లను అధికారులు అభివృద్ధి చేస్తున్నారు. తాజాగా విశాఖలోని సాగర్‌నగర్‌ బీచ్​‌ పరిశరాలను సుందరీకరిస్తున్నారు.

అందంగా..ఆకర్షణీయంగా

గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ సమ్మిట్‌కు, జీ-20 సదస్సు ఉండడంతో నగరాన్ని, బీచ్‌లను మరింత సుందరంగా అధికారుల తీర్చిదిద్దుతున్నారు . విశాఖలోని ప్రధాన బీచ్ లకు రద్దీ తగ్గించే క్రమంలో మిగతా సముద్రతీరాలు అందంగా ముస్తాబు అవుతున్నాయి. బ్యూటిఫికేషన్‌ పేరుతో కొత్త బీచ్‌లు, కొత్త రోడ్లు, కొత్త పార్క్‌లు నిర్మిస్తున్నారు. ఈ క్రమంలోనే జోడుగుళ్లపాలెం, సాగర్‌నగర్‌లో యుద్ధప్రాతిపదిన పనులు జరుగుతున్నాయి. కొత్త రోడ్లు, కొత్త పార్క్‌లు, కొత్త బీచ్‌లతో కళకళలాడుతోంది విశాఖ నగరం. బీచ్ ల అభివృద్ధి కోసం రూ.43 లక్షలు కేటాయించినట్లు తెలుస్తోంది.

కొత్త బీచ్‌లు, రోడ్లు

ఆర్కేబీచ్, యారాడ, రుషికొండ బీచ్ తరహాలో సాగర్ నగర్‌లో కూడా అభివృద్ధి పనులు చేపట్టారు. 200 కొబ్బరి చెట్లు నాటేందుకు జీవీఎంసీ ప్లాన్ చేసింది.15 ఏళ్ల వయస్సు గల 200 కొబ్బరి చెట్లను నాటి సౌందర్యంగా కనిపించే విధంగా తీర్చిదిద్దాలని భావిస్తోంది. సన్‌రే రిసార్ట్స్, జీవీఎంసీ సమిష్టి కృషితో ఈ పనులు జరుగుతున్నాయి. ఈ చర్య వేసవిలో బీచ్‌ని సందర్శించే పర్యాటకులకు నీడను అందించడంతోపాటు అందంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకుంది. కొబ్బరి చెట్లు మార్నింగ్ వాక్ కోసం ఇక్కడికి వచ్చేవారికి, పగటిపూట బీచ్‌ని సందర్శించే పర్యాటకులకు కూడా నీడను అందించడంతో పాటు ఆకర్షణీయంగా కనిపిస్తాయి.