అమ్మకోసం మట్టిని తడుముతూ.. చిట్టితల్లికి ఎంత కష్టం! - MicTv.in - Telugu News
mictv telugu

అమ్మకోసం మట్టిని తడుముతూ.. చిట్టితల్లికి ఎంత కష్టం!

June 14, 2019

 

తల్లి కడుపులోంచి అప్పడే బయటిపడింది. ఇంకా కళ్లు కూడా తెరవనేదు. ఆ తల్లికి ఎన్ని కష్టాలున్నాయో ఏమోగాని పేగుబంధాన్ని మట్టిలో వదిలేసి నిర్దయాగా వెళ్లిపోయింది. ఆ పచ్చినెత్తురుగుడ్డు తల్లి కోసం, చనుబాల కోసం అటూ ఇటూ కదులుతోంది. వణుకుతోంది, ఎండకు ఎండిపోతోంది. చూస్తున్న వాళ్లను గుండెలు బద్దలవుతున్నాయి. ఇద్దరు మానవమూర్తులు ఆ చిన్నారిని అక్కున చేర్చుకుని ఆస్పత్రికి తరలించారు. హృదయవిదారకమైన ఈ ఉదంతం రాజస్తాన్‌లోని నాగౌర్‌లో గతవారం వెలుగు చూసింది. సాక్షి జోషి, వినోద్ కాప్రీ అనే స్థానికులు ఆ చిన్నారిని వెంటనే జేఎల్ఎన్ ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వైద్యులు రేయింబవళ్లు కష్టపడి చిన్నారి ప్రాణాలు కాపాడారు. పాపకు పిహూ అని పేరు పెట్టారు. ఆమె త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టు పెడూతూ ప్రార్థిస్తున్నారు.