New cases of over 14 thousand corona in India: Center
mictv telugu

భారత్‌లో 14వేలు దాటిన కరోనా కొత్త కేసులు: కేంద్రం

June 29, 2022

 

భారతదేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 14,506 కరోనా కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు బుధవారం బులెటెన్ విడుదల చేశారు. విడుదలైన బులెటెన్ వివరాల ప్రకారం..”మొత్తం 14,506 కొత్త కేసులు నమోదైయ్యాయి. దీంతో మొత్తం 4,34,33,345కు చేరుకున్నాయి. ఇప్పటివరకూ 4,28,08,666 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం 5,25,077 మంది కరోనాకు బలయ్యారు. రోజువారీ పాజిటివ్‌ కేసులు భారీగా పెరుగుతుండడంతో యాక్టివ్‌ కేసుల సంఖ్య లక్షకు చేరుకుంది. ప్రస్తుతం 99,602 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. గత 24 గంటల్లో 30 మంది మృతిచెందగా, 11,574 మంది డిశ్చార్జీ అయ్యారు”.

మరోపక్క రోజువారీ పాజిటివిటీ రేటు 3.38 శాతానికి పెరిగిందని కేంద్ర ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. మొత్తం కేసుల్లో 0.23 శాతం కేసులు యాక్టివ్‌గా ఉండగా, రికవరీ రేటు 98.56 శాతం, మరణాలు 1.21 శాతంగా ఉన్నాయని అన్నారు. ఇప్పటివరకు 197.46 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని, మంగళవారం ఒకేరోజు 13,44,788 మంది వ్యాక్సిన్‌ తీసుకున్నారని వివరాలను వెల్లడించారు.