సుప్రీం కోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించిన రాష్ట్రపతి - MicTv.in - Telugu News
mictv telugu

సుప్రీం కోర్టుకు కొత్త చీఫ్ జస్టిస్‌ను నియమించిన రాష్ట్రపతి

October 29, 2019

Justice ..

సుప్రీం కోర్టు 18వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ బాబ్డేను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ సంతకం చేశారు. మంగళవారం రాజ్‌భవన్ నుంచి దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ పదవి కాలం నవంబర్ 17న ముగుస్తోంది. దీంతో ఆయన స్థానంలో బాబ్డేను నియమించారు. త్వరలోనే బాధ్యతలు చేపట్టి 18 నెలల పాటు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిగా ఎస్ఏ బాబ్డే వ్యవహరించనున్నారు.

పదవీ విరమణకు నెల రోజుల ముందు తదుపరి చీఫ్ జస్టిస్ పేరును ప్రస్తుత చీఫ్ జస్టిస్ ప్రతిపాదించడం ఒక ఆనవాయతీగా వస్తోంది. ఈ నేపథ్యంలో జస్టిస్ ఎస్ఏ బాబ్డే పేరును గొగొయ్ ప్రతిపాధించగా దీనిపై సాధ్యాసాధ్యాలను పరిశీలించిన రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఈ నెల 18న బాబ్డే ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 

జస్టిస్ బాబ్డే ప్రస్థానం : 

నాగపూర్‌లో1956 ఏప్రిల్ 24న  జస్టిస్ బాబ్డే జన్మించారు. 2000 సంవత్సరంలో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా బాధ్యతలను స్వీకరించారు. 2012లో మధ్యప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ పనిచేశారు. తర్వాత 2013 ఏప్రిల్ లో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చారు. అయోధ్య స్థల వివాదం కేసును విచారిస్తున్న రాజ్యాంగ ధర్మాసనంలోని ఐదుగురు సభ్యుల్లో ఆయన కూడా ఒకరు. పలు కీలక కేసుల విచారణ కూడా ఈయన చేపట్టారు. నవంబర్ 18 నుంచి ఆయన సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టనున్నారు.