తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే నియామకం! - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ హైకోర్టుకు కొత్త సీజే నియామకం!

May 17, 2022

రాష్ట్ర హైకోర్టు కొత్త సీజేగా జస్టిస్ ఉజ్వల్ భుయాన్ నియామకం కానున్నారు. ఇప్పుడున్న సీజే సతీష్ చంద్ర శర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీపై వెళ్లనున్నారు. మన రాష్ట్రంతో పాటు మరో నాలుగు రాష్ట్రాలు ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, రాజస్తాన్, గుహవాటి హైకోర్టులకు కొత్త సీజేలను నియమించనున్నారు. ఢిల్లీ హైకోర్టు సీజే ఉత్తరాఖండ్‌కు, బాంబే సీజే హిమాచల్ ప్రదేశ్‌కు, గుజరాత్ సీజేను గుహవాటి హైకోర్టుకు, బాంబే హైకోర్టు మరో సీజే రాజస్థాన్ హైకోర్టుకు వెళ్లనున్నారు. ఈ మేరకు కొలీజియం సిఫారసు చేసినట్టు సుప్రీంకోర్టు ఓ ప్రకటనలో తెలిపింది.