ఆర్జీవీ 'డేంజరస్'కు కొత్త చిక్కు..స్టే ఇచ్చిన కోర్టు - MicTv.in - Telugu News
mictv telugu

ఆర్జీవీ ‘డేంజరస్’కు కొత్త చిక్కు..స్టే ఇచ్చిన కోర్టు

May 5, 2022

టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు సిటీ సివిల్ కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. తాజాగా ఆయన ఇద్దరు అమ్మాయిలతో లెస్బియన్ కథంశంతో తెరకెక్కించిన ‘డేంజరస్’ (మా ఇష్టం) చిత్రాన్ని థియేటర్లో కానీ, ఓటీటీలో కానీ రిలీజ్ చేయకూడదని గురువారం కోర్టు స్టే ఇచ్చింది. ఇందుకు కారణం.. గతంలో ఆర్జీవీ తన వద్ద డబ్బులు తీసుకొని, తిరిగి ఇవ్వటం లేదని ‘డేంజరస్’ చిత్రం నిర్మాత నట్టి కుమార్ కోర్టులో పిటిషన్ వేసిన విషయం తెలిసిందే. తీసుకున్న డబ్బులను తిరిగి ఇచ్చేవరకు ఈ ‘డేంజరస్’ సినిమాను రిలీజ్‌ చేయకూడదని ఆయన కోర్టు నుంచి స్టే తీసుకొచ్చారు.

దానిపై ఆర్జీవీ స్పందిస్తూ..’ఈ సినిమా ఆగింది నట్టి కుమార్ వల్ల కాదు. సినిమాకు స్క్రీన్లు దొరక్కపోవడం వల్ల. మే 6వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తాం’ అని ఆర్జీవీ ప్రకటించాడు. ఈ క్రమంలో రేపు (మే 6) సినిమా విడుదల కావడానికి సర్వం సిద్దమైంది. ‘నట్టి కుమార్ కొడుకు నట్టి క్రాంతికి మొత్తం డబ్బులు చెల్లించిన తర్వాతే, సినిమాను విడుదల చేయాలి. అంతవరకు థియేటర్లో కానీ, ఓటీటీలో కానీ సినిమాను విడుదల చేయడానికి వీల్లేదు’ అని ఆర్జీవీకి మరోసారి కోర్టు స్టే ఇచ్చింది.