కరోనా పుట్టిల్లు చైనాను వణికిస్తున్న కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ – 7 వైరస్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటికే ముగ్గురిలో ఈ వైరస్ ని గుర్తించారు. గుజరాత్ లో ఇద్దరు, ఒడిషాలో ఒకరిలో ఈ వైరస్ ని గుర్తించగా, వారితో పాటు ఉన్న వ్యక్తులను ఐసోలేషన్ కి పంపారు. ఈ నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్రం ఎయిర్ పోర్టుల్లో హై అలర్ట్ ప్రకటించింది. బుధవారం కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మాండవీయ వైద్య నిపుణులు, అధికారులతో సమావేశమై కొన్ని కీలక సూచనలు చేశారు. రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కునేందుకు సిద్దంగా ఉండాలన్నారు. ప్రస్తుతానికి కరోనా అదుపులోనే ఉందని, రద్దీగా ఉండే ప్రదేశాల్లో మాస్కులు ధరించాలని విజ్ఞప్తి చేశారు. విదేశాల నుంచి రాకపోకలపై ఎలాంటి ఆంక్షలు లేవని స్పష్టం చేశారు. మనం భయపడాల్సిన పని లేదని చైనా, జపాన్, కొరియా దేశాలలోనే కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోందన్నారు.