ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 38 మంది మృతి - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో కరోనా విజృంభణ.. ఒక్కరోజే 38 మంది మృతి

October 15, 2020

New coronavirus cases in andhra pradesh

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజుకి సగటున నాలుగువేల కొత్త పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. గడచిన 24 గంటల్లో ఏపీలో 4,038 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 686 కేసులు నమోదయ్యాయి. అత్యల్పంగా విజయనగరం జిల్లాలో 96 కేసులు గుర్తించారు. 

అలాగే గడిచిన 24 గంటల్లో ఏపీలో 38 మంది మృతి చెందారు. చిత్తూరులో అత్యధికంగా 9 మంది మరణించారు. నిన్న 5,622 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. పాజిటివ్ కేసులకంటే డిశ్చార్జిలు ఎక్కువగా నమోదవుతుండటం కాస్త ఉపశమనం కలిగిస్తోంది. ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 7,71,503 కాగా, 7,25,099 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 40,047 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,357 మంది కరోనా బారిన పడి మరణించారు.