దేశంలో ఒక్కరోజులో 24,850 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో ఒక్కరోజులో 24,850 కరోనా కేసులు

July 5, 2020

vgmhbm

దేశంలో కరోనా వైరస్ ప్రభావం ఏమాత్రం తగ్గడం లేదు. గడిచిన 24 గంటల్లో కొత్తగా 24,850 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు దేశ వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా సగటున రోజుకి ఇరవై వేల కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఇప్పటివరకు దేశంలో నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 6,73,165కు పెరిగింది. ప్రస్తుతం దేశంలో 2,44,814 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది.

కరోనా మహమ్మారి నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్యా  4,09,083కి పెరిగింది. ఇక కరోనా మరణాల విషయానికి వస్తే.. గడిచిన 24 గంటల్లో 613 మందిని ఈ మహమ్మారి పొట్టన పెట్టుకుంది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 19,268కి పెరిగింది. దేశంలో ఇప్పటి వరకు 97,89,066 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24గంటల్లో 2,48,934 కరోనా పరీక్షలు నిర్వహించారు.