భారత్‌ కరోనా అప్‌డేట్ : కేసులు, మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌ కరోనా అప్‌డేట్ : కేసులు, మరణాలు

September 27, 2020

gn vb n

భారత్‌లో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజుకి సగటున తొంబై వేల కేసులు నమోదు అవుతున్నాయి. శనివారం కొత్తగా 88,600 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 5,992,533కు చేరింది. 

నిన్న ఒక్కరోజే 1,124 మంది కరోనా వైరస్ బాధితులు మరణించారు. దీంతో దేశంలో మొత్తం మరణాల సంఖ్య 94,503కు చేరుకుంది. దేశంలో ప్రస్తుతం 9,56,402 యాక్టవ్‌ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు 49,41,628 మంది కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నారు.