తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కొత్తగా 1,931 కరోనా కేసులు

August 13, 2020

new coronavirus cases in telangana

రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరగడమే తప్ప తగ్గడం అనే మాట ఎత్తడం లేదు. రోజుకి సగటున రెండు వేల కేసులు నమోదు అవుతున్నాయి. ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధిక కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా బుధవారం నమోదైన కేసుల వివరాలను రాష్ట్ర ఆరోగ్యశాఖ విడుదల చేసింది. బుధవారం రాత్రి 8 గంటల వరకు కొత్తగా 1,931 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 86,475కి పెరిగింది. నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ కారణంగా 11 మంది మరణించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం 665 కరోనా మరణాలు సంభవించాయి. నిన్న ఒక్కరోజే 1,780 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ఇప్పటివరకు డిశ్చార్జ్ అయినా వారి సంఖ్య 63,074కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 22,736 యాక్టీవ్ కరోనా పాజిటివ్ కేసులున్నాయి. వారిలో 15,621 మంది ఇంట్లో హోమ్ ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందుతున్నారు. ఇక రాష్ట్రంలో కరోనా టెస్టుల విషయానికి వస్తే..నిన్న ఒక్కరోజే 23,303 నమూనాలను పరీక్షించారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 6,89,150 కరోనా టెస్టులు చేశారు.