తెలంగాణ కరోనా అప్‌డేట్ : కేసులు, మరణాలు  - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణ కరోనా అప్‌డేట్ : కేసులు, మరణాలు 

September 20, 2020

ngnvb

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రోజుకి రెండు వేలకు ఏ మాత్రం తక్కువగా నమోదు కావడం లేదు. ఇన్ని రోజులు పట్టణాలను వణికించిన ఈ మహమ్మారి ప్రస్తుతం గ్రామాలకు కూడా విస్తరిస్తోంది. గడిచిన 24 గంటల్లో 2,137 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన పడ్డారు. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 1,71,306కి చేరింది. అలాగే 8 మంది ప్రాణాలు కోల్పోయారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. 

దీంతో మృతుల సంఖ్య 1033కి చేరింది. నిన్న 53,811 కరోనా నిర్దారణ పరీక్షలు నిర్వహించారు. ఇక రికవరీల విషయానికి వస్తే… నిన్న ఒక్కరోజే 2,192 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,39,700కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 30,573 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని, వారిలో 24,019 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 24,88,220కి చేరింది.