తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తక్కువగా నమోదైన కేసులు తాజాగా మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో కేవలం 1,481 కొత్త పాజిటివ్ కేసులు, నాలుగు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. అలాగే మంగళవారం రోజున 1,451 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇప్పటివరకు 2,14,917 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,34,152కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 17,916 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 14,883 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1319మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 91.40% శాతంగా ఉంది. రాష్ట్రంలో నిన్న 40,081 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 41,55,597 పరీక్షలు చేసారు.
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana. (Dated. 28.10.2020)@Eatala_Rajender @TelanganaHealth @GHMCOnline pic.twitter.com/hJOKxl11Um
— Dr G Srinivasa Rao (@drgsrao) October 28, 2020