భారత్‌లో కరోనా : కొత్త కేసులు, డిశ్చార్జీలు, మరణాలు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా : కొత్త కేసులు, డిశ్చార్జీలు, మరణాలు

October 14, 2020

New coronavirus positive cases in India

భారత్‌లో కరోనా కేసుల సంఖ్య 72 లక్షల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో 63,509 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ అయింది. 730 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ పేర్కొంది. ఇప్పటి వరకు 72,39,390 మందికి వ్యాధి సోకింది. వీరిలో 63,01,928 మంది కోలుకున్నారు. 

1,10,586 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజే 71,760 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 8,26,876 ఆక్టివ్ కేసులున్నాయి. వీరిలో అత్యధికులు హోం క్వారంటైన్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 86.36 శాతం ఉండగా, డెత్ రేటు 1.3 శాతంగా ఉంది. ప్రతి మిలియన్ మందికి గాను అత్యంత తక్కువ కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వెల్లడించింది.