భారత్‌లో కరోనా తగ్గుముఖం.. నిన్న 61,871 కొత్త కేసులు  - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కరోనా తగ్గుముఖం.. నిన్న 61,871 కొత్త కేసులు 

October 18, 2020

India

భారత్‌లో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. గతంలో రోజుకి సగటున 90 వేల కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం ఆ సంఖ్య అరవై వేలకు పడిపోయింది. శనివారం రోజున కొత్తగా 61,871కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 74,94,551కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ సోకి 1033 మంది బాధితులు మరణించారు. 

ఇక డిశ్చార్జిల విషయానికి వస్తే.. నిన్న ఒక్కరేజే 72,614మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 65,97,209 మంది కరోనా నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 87.56 శాతంగా ఉంది. 1,12,998 మంది బాధితులు మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,83,311ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. టెస్టుల విషయానికి వస్తే.. ఇప్పటి వరకు మొత్తం 9,32,54,017 శాంపిళ్లను పరీక్షలు చేశారు. దేశవ్యాప్తంగా 88.03% రికవరీ రేటు, 1.52% మరణాల రేటు కొనసాగుతోంది.