భారత్‌లో 75 లక్షలు దాటిన కరోనా కేసులు...  - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో 75 లక్షలు దాటిన కరోనా కేసులు… 

October 19, 2020

vbgnnfnf

భారత్‌లో కరోనా వైరస్ కేసులు 75 లక్షల మైలురాయిని దాటింది. రోజు వారి కేసులు తగ్గుతూ వస్తున్నాయి.   గతంలో రోజుకి సగటున 90 వేల కేసులు నమోదయ్యేవి. ప్రస్తుతం ఆ సంఖ్య యాభై వేలకు పడిపోయింది. ఆదివారం రోజున కొత్తగా 55,722కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. 

దీంతో మొత్తం కేసుల సంఖ్య 75,50,273కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ సోకి 579 మంది బాధితులు మరణించారు. ఇక డిశ్చార్జిల విషయానికి వస్తే.. నిన్న ఒక్కరేజే 66,399మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 66,63608 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,14,610 మంది బాధితులు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,72,055 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి.