భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు

October 21, 2020

New coronavirus positive cases in India

భారత్‌లో తగ్గిన కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా సగటున నలభై వేల కేసులు నమోదు కాగా.. నిన్న స్వల్పంగా పెరిగి 54,044కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 76,51,108కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ సోకి 717 మంది బాధితులు మరణించారు. ఇక డిశ్చార్జిల విషయానికి వస్తే.. నిన్న ఒక్కరేజే 61,775 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

ఇప్పటివరకు 67,95,103మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,15,914 మంది బాధితులు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 7,40,090 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 88.63 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.52 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.85 శాతంగా ఉంది.