భారత్‌ కరోనా అప్‌డేట్.. నిన్న 48,648 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌ కరోనా అప్‌డేట్.. నిన్న 48,648 కేసులు

October 30, 2020

New coronavirus positive cases in India .jp

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా 50 వేల లోపు కేసులు నమోదు అవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 48,648 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన బారినపడ్డారు. అలాగే ఈ మహమ్మారి కారణంగా నిన్న 563 మంది ప్రాణాలు కోల్పోయారు. 

57,386 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రికవరీ రేటు 90.23కి చేరింది. దేశవ్యాప్తంగా 80,88,851 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారిలో 1,21,090 మంది ప్రాణాలు కోల్పోయారు. 73,73,375 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 5,94,386 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది.