తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. నిన్న 1,446 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. నిన్న 1,446 కేసులు

October 14, 2020

New coronavirus positive cases in telangana

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. నిన్న ఒక్కరోజే 40,056 కరోనా నిర్థారణ పరీక్షలు చేయగా..1,446 మందికి కొత్తగా వ్యాధి నిర్ధారణ జరిగింది. ఎనమిది మంది ఈ వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్తగా 1,918 మంది కోలుకున్నారు. 

దీంతో రికవరీ రేటు 88.45 శాతానికి చేరింది. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 2,16,238 మందికి ఈ వైరస్ సోకింది. వారిలో ఇప్పటివరకు 1,241 మంది బాధితులు మృత్యువాతపడ్డారు. 1,91,269 మంది వ్యాధి బారి నుంచి కోలుకోగా.. ఇంకా 23,728 మంది ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. వీరిలో దాదాపు 19,413 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. మిగితా వారు మాత్రమే వివిధ ఆస్పత్రుల్లో చికిత్స తీసుకుంటున్నారు. కాగా, ఇప్పటి వరకు తెలంగాణలో 36,64,152 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేశారు.