తెలంగాణలో కరోనా తగ్గుముఖం..నిన్న 1,436 కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో కరోనా తగ్గుముఖం..నిన్న 1,436 కేసులు

October 18, 2020

 

తెలంగాcaronaaణలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో నమోదైన కరోనా కేసుల వివరాలను రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ప్రకటించారు. శనివారం కొత్తగా 1436 కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,22,11కు చేరింది. కరోనాతో నిన్న ఒక్క రోజే ఆరుగురు మృతి చెందారు. 

ఇప్పటి వరకు మృతి చెందిన వారి సంఖ్య 1,271కి చేరింది. నిన్న 2,154 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్నవారి సంఖ్య 1,98,790కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 22,050 యాక్టివ్‌ కేసులున్నాయి. వీరిలో 18,279 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మిగతా వారు హాస్పిటల్‌లో ఉండి చికిత్స పొందుతున్నారు.