భారత్‌ కరోనా అప్ డేట్.. 80 లక్షలకు చేరువైన కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌ కరోనా అప్ డేట్.. 80 లక్షలకు చేరువైన కేసులు

October 28, 2020

New coronavirus positive cases in telangana

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా 50 వేల లోపు కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 43,893 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన బారినపడ్డారు. 9,58,116 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా నిన్న  508 మంది ప్రాణాలు కోల్పోయారు. 

58,439 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రికవరీ రేటు 90.23కి చేరింది. దేశవ్యాప్తంగా 79,90,322 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారిలో 1,20,010 మంది ప్రాణాలు కోల్పోయారు. 72,59,509 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,10,803 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది.