తెలంగాణలో నిన్న 1,531 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో నిన్న 1,531 కరోనా కేసులు

October 30, 2020

తెలంగాణలో కరోనా వైరస్ కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా తక్కువగా నమోదైన కేసులు తాజాగా మళ్ళీ పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 1,531 కొత్త పాజిటివ్‌ కేసులు, ఆరు కరోనా వైరస్ మరణాలు సంభవించాయి. అలాగే గురువారం రోజున 1,048 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నవారు. ఇప్పటివరకు 2,17,401 మంది కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. 

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కేసుల సంఖ్య 2,37,187కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 18,456 యాక్టివ్ కేసులు ఉన్నాయి. వారిలో 15,425 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1330మంది కరోనాతో మరణించారు. రాష్ట్రంలో రికవరీ రేటు 91.40% శాతంగా ఉంది. రాష్ట్రంలో నిన్న 43,790 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు చేశారు. ఇప్పటివరకు 42,40,748 పరీక్షలు చేసారు.