భారత్‌లో కొత్తగా 50,129 కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

భారత్‌లో కొత్తగా 50,129 కరోనా కేసులు

October 25, 2020

report

భారత్‌లో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 50,129 కొత్త కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 78,64,811కి చేరింది. అలాగే నిన్న ఒక్కరోజే కరోనా వైరస్ సోకి 578 మంది బాధితులు మరణించారు. ఇక డిశ్చార్జిల విషయానికి వస్తే.. నిన్న ఒక్కరేజే 62,077 మంది కరోనా నుంచి కోలుకున్నారు. 

ఇప్పటివరకు 70,78,123మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1,18,534 మంది బాధితులు కరోనా వైరస్ వల్ల మృత్యువాత పడ్డారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,68,154 ఆక్టివ్ కరోనా కేసులున్నాయి. ప్రస్తుతం దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 90 శాతంగా ఉంది. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో 1.51 శాతానికి తగ్గిన మరణాల రేటు, దేశంలో నమోదయిన మొత్తం కేసులలో యాక్టివ్ కేసుల శాతం 9.85 శాతంగా ఉంది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా పదికోట్ల కరోనా వైరస్ పరీక్షలు నిర్వహించారు.