అత్తారింటికి దారి మూసేసి కరోనా..  - MicTv.in - Telugu News
mictv telugu

అత్తారింటికి దారి మూసేసి కరోనా.. 

March 26, 2020

New Couple Suffer From Lockdown  

లాక్‌డౌన్ పుణ్యమా అని పోలీసులు ఎవరినీ రోడ్లపై తిరగనివ్వడం లేదు.  గ్రామాల్లో కూడా ప్రజలు తమ ఊళ్లలోకి రాకుండా కంచెలను ఏర్పాటు చేస్తున్నారు. బయటి వారిని ఎవరిని తమ ఊళ్లలోకి రానివ్వడం లేదు. ఎన్ని చెప్పినా తమకు వైరస్ అంటుకుంటుందనే భయంతో వారిని వెనక్కి పంపించి వేస్తున్నారు. ఈ పరిస్థితి అన్ని గ్రామాల్లోనూ కనిపిస్తుంది. తాజా ఆంక్షలు కొత్త జంటలకు కష్టాలు తెచ్చిపెడుతున్నాయి. వారు రాకపోకలు సాగించేందుకు ఏ మాత్రం అవకాశం లేకుండా పోయింది. 

హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న జంట పుట్టింటికి, మెట్టింటికి వెళ్లి నిద్ర చేయాల్సి ఉంటుంది. ఆచారం ప్రకారం కొన్ని కార్యక్రమాలు కూడా చేస్తారు. కానీ ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ ఉన్న నేపథ్యంలో నూతన వధూవరులు ఇబ్బందులు పుడుతున్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేట మండలం పార్వతీపురంలో ఓ నూతన జంటకు ఊహించని పరిణామం ఎదురైంది. రాజాంలో ఉన్న అత్తారింటికి వెళ్లేందుకు వచ్చిన జంటను వెళ్లేందుకు అంగీకరించలేదు. లాక్‌డౌన్ కారణంగా దారి ఇచ్చేదే లేదని తేల్చారు. దీంతో చేసేదేమి లేక తిరిగి వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.