ప్రీ వెడ్డింగ్ షూట్ పిచ్చి పీక్స్.. ఏం చేశారో చూడండి! - MicTv.in - Telugu News
mictv telugu

ప్రీ వెడ్డింగ్ షూట్ పిచ్చి పీక్స్.. ఏం చేశారో చూడండి!

November 23, 2019

New Couple Wedding Shoot Muddy Field

పెళ్లి అంటే నూరేళ్ల పంట.. కాపురం నూరేళ్లు పచ్చగా ఉండాలని పెద్దలు కొత్త జంటను ఆశీర్వదిస్తుంటారు. వాళ్ల మాటలకు ఏమో కానీ దాన్నే ఓ జంట సీరియస్‌గా తీసుకుంది. తమ కాపురం పచ్చగా ఉండాలంటే ముందు నాట్లు వేసే పొలంలో దిగాలని అనుకుందో ఏమో వెరైటీగా బురదలోకి దిగి ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. పొలం మడిలోకి దిగి దాంట్లో దొర్లుతూ ప్రీ వెడ్డింగ్ షూట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 

 

కేరళకు చెందినన జోస్, అనీషా అనే కొత్త జంట తమ పెళ్లి తర్వాత వెడ్డింగ్ షూట్ కోసం వెళ్లారు. వీరికి బిను సీన్స్ ఫొటో గ్రఫీ కెమెరామెన్లు రొటీన్‌కు భిన్నంగా ప్లాన్ చేశారు. కొత్త జంటతో బురద ప్రయోగం చేసి ఫొటోషూట్ చేశారు.బురదలో దొర్లుతూ ఈ కొత్త జంట ఫొటోలకు ఫోజులిచ్చింది. పెళ్లి అంటే నూరేళ్ల పంట అంటే నిజంగానే పొలంలోకి దిగారు అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఎప్పుడూ రొటీన్‌గా ఉండకూడదనే ఈ ప్రయోగం చేసినట్టు ఫొటో గ్రాఫర్లు చెబుతున్నారు.