కొత్త డ్యాన్స్ అంట..  మీరు ట్రై చేస్తారా? - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త డ్యాన్స్ అంట..  మీరు ట్రై చేస్తారా?

March 14, 2019

ఇటీవల సోషల్ మీడియాను షేక్ చేసిన డ్యాన్సులు ఏవంటే ముందుగా గుర్తొచ్చేది మాత్రం లుంగిడ్యాన్స్, గంగ్నమ్ స్టైల్ డ్యాన్స్‌లే. ఇప్పుడు మరో డ్యాన్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అదేంటంటే?  ట్రయాంగిల్ డ్యాన్స్.. ముగ్గురు త్రిభుజాకారంలో నిల్చొని ఒకరి భుజంపై ఒకరు చేతులు వేసుకొని ఒకరి మధ్యలో ఇంకొకరు గెంతడమే ట్రయాంగిల్ డ్యాన్స్.

ఈ డ్యాన్స్ వీడియోలు చూసిన నెటిజన్లు నవ్వు ఆపుకోలేకపోతున్నారు. ఈ డ్యాన్స్ అందరూ బాగానే చేస్తున్నా… కొందరు మాత్రం కిందపడి నవ్వు తెప్పిస్తున్నారు. నెలరోజుల క్రితం ఈ ట్రయాంగిల్ డ్యాన్స్ ఛాలెంజ్ టిక్‌టాక్ యాప్‌లో బాగా వైరల్ అయ్యింది. దీంతో అందరూ ఈ డ్యాన్స్ చేస్తూ సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నారు.