ఏప్రిల్ 4 నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం: జగన్ - MicTv.in - Telugu News
mictv telugu

ఏప్రిల్ 4 నుంచి ఏపీలో కొత్త జిల్లాలు ప్రారంభం: జగన్

March 30, 2022

jjjj

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ప్రారంభానికి జగన్ ప్రభుత్వం ముహూర్తం ఖ‌రారు చేసింది. ఇందుకు సంబంధించిన తేదీలను బుధవారం ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్ 4న ఉదయం 9.05 నుంచి 9:45 మధ్య కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తామని తెలిపింది. అంతేకాకుండా ఏప్రిల్ 6న వాలంటీర్ల సేవలకు సత్కార కార్యక్రమం జరగుతుందని, ఏప్రిల్ 8న వసతి దీవెన కార్యక్రమం నిర్వహిస్తామని ప్రభుత్వం వెల్లడించింది.

కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్ అధ్యక్షతన నేటి ఉదయం ఉన్నతస్థాయి సమావేశం జరిపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై అధికారులతో జగన్ చర్చించారు. పలు జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్ల మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై చర్చ జరిపారు. అనంతరం ఈ నిర్ణయాలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

మరోపక్క ఏపీలో కొత్త‌గా అందుబాటులోకి రానున్న జిల్లాల‌తో క‌లిపి మొత్తం జిల్లాల సంఖ్య 26కు చేరుకోనుంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత 13 జిల్లాల‌తో కొత్త ప్ర‌స్థానం ప్రారంభించిన ఏపీ.. ఇప్పుడు జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యంతో 26 జిల్లాల‌తో సాగ‌నుంది. ప్ర‌తి పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాన్ని ఓ జిల్లాగా మారుస్తానంటూ 2019 ఎన్నిక‌ల స‌మ‌యంలోనే జ‌గ‌న్ ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. ఈ హామీ మేర‌కు విశాఖ‌లో అర‌కును ఓ జిల్లాగా మారుస్తూ కొత్త జిల్లాల సంఖ్య‌ను 13గా జ‌గ‌న్ స‌ర్కారు నిర్ణ‌యించింది.