కొత్త ఈ బైక్.. 100 కిలోమీటర్లకు ఖర్చు రూ. 23 మాత్రమే - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త ఈ బైక్.. 100 కిలోమీటర్లకు ఖర్చు రూ. 23 మాత్రమే

March 3, 2022

21

పెట్రో ధరల మంటతో చాలా మంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. అందుకు తగ్గట్టే కంపెనీలు కొత్త కొత్త మోడళ్లతో, ప్రజలను ఆకట్టుకునే ధరలతో మార్కెట్‌లోకి వస్తున్నాయి. తాజాగా జాయ్ ఇ-బైక్ అనే కంపెనీ మాన్‌స్టర్ అనే పేరుతో ఎలక్ట్రిక్ బైక్‌ను విడుదల చేస్తూ.. దానికి సంబంధించిన వివరాలను వెల్లడించింది. ఒక్క సారి ఛార్జింగ్ చేస్తే 95 కిలోమీటర్ల దూరం నడుస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. 500 కిలోమీటర్లు ప్రయాణించడానికి కేవలం 115 రూపాయలే ఖర్చవుతుందనీ, ఆ లెక్కన చూస్తే 100 కిలోమీటర్లు ప్రయాణించడానికి కేవలం 23 రూపాయలు మాత్రమే ఖర్చవుతుందని వివరించారు. ఇంకా.. ఈ బైక్ 72V, 39 AH లిథియం అయాన్ బ్యాటరీని కలిగి ఉండి, 1500 డీసీ బ్రష్‌లెస్ హబ్ మోటార్‌తో పని చేస్తుంది. బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్ అవడానికి 5 గంటల సమయం పడుతుంది. గంటకు 60 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వెళ్లే ఈ బైక్ ఎక్స్-షోరూమ్ ధర రూ.98,666గా ఉంది. కాగా, గుజరాత్ ప్రభుత్వం 9 నుంచి 12 వ తరగతి చదివే విద్యార్థులకు ఈ బైక్ మీద 12 వేల రూపాయల సబ్సిడీని అందిస్తోంది. జెన్‌ నెక్ట్స్‌, వోల్ఫ్‌, గ్లోబ్‌, మాన్‌స్టర్‌ వేరియంట్‌లకు ఈ సబ్సిడీ లభించనుంది.