ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ఫీచర్లను త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. కొత్తగా వస్తున్న ఫీచర్లలో భారతీయులకు ఉపయోగపడేవే ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే మన దేశంలో 49 కోట్ల మంది వాట్సాప్ వినియోగదారులు ఉన్నారు. ఇక ఫీచర్ల విషయానికొస్తే.. ఇప్పటివరకు ఒక జీబీ వరకు ఫైల్స్ పంపుకునే వీలుండగా, కొత్త ఫీచర్లో రెండు జీబీ వరకు పంపవచ్చు. అలాగే గ్రూప్ కాల్స్ కింద ఇప్పటివరకు ఒకేసారి నలుగురు మాట్లాడుకునే సౌలభ్యం ఉండగా, ఇక నుంచి ఎనిమిది మంది గ్రూప్ కాల్స్ మాట్లాడుకోవచ్చు. అంతేకాక, వాయిస్ కాల్‌ను ఒకేసారి 32 మందితో మాట్లాడుకోవచ్చు. గ్రూపు అడ్మిన్లకు ఏదైనా మెసేజ్‌ను ఎప్పుడైనా డిలీట్ చేసే సౌకర్యం రానుంది. ఎమోజీ రియాక్షన్స్‌ను కూడా త్వరలో ప్రవేశపెట్టనున్నట్టు వాట్సాప్ తెలిపింది.