New format for 2024 Men's T20 World Cup
mictv telugu

సరికొత్తగా 2024 T20 వరల్డ్ కప్

November 22, 2022

New format for 2024 Men's T20 World Cup

ఆస్ట్రేలియా వేదికగా 2022 టీ20 వరల్డ్ కప్ ముగిసింది. మొత్తం 16 జట్లు ఈ టోర్నీలో పాల్గొన్నాయి. చివరికి ఇంగ్లాండ్ కప్‌ను ఎగరేసుకుపోయింది. ఇక వచ్చే 2024 వరల్డ్ కప్‌కు వెస్టిండీస్, యునైటెడ్ స్టేట్స్ సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. 2024 వరల్డ్‌ కప్ సరికొత్తగా తీర్చిదిద్దేందకు ఐసీసీ ప్రయత్నిస్తుంది. ఇప్పటినుంచే దీనిపై కసరత్తు మొదలు పెట్టేసింది. క్రికెట్ అభిమానులకు మజా ఇచ్చే విధంగా చేసిన మార్పులను ఐసీసీ తాజాగా వెల్లడించింది.

2024 t20 వరల్డ్ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొననున్నాయి. ఇవి ఐదు జట్ల చొప్పున నాలుగు గ్రూపులుగా విడిపోయి ఆడనున్నాయి. తర్వాత అసలైన పోరు సూపర్ -8 స్టేజ్‌లో ఉండనుంది. ఇక సూపర్ -8లో నాలుగేసి జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి తలపడతాయి. అక్కడ టాప్ 2 స్థానాల్లో నిలిచిన నాలుగు జట్లు సెమీస్‌కు చేరుతాయి. చివరి రెండు జట్లతో ఫైనల్ నిర్వహిస్తారు.

2024 ప్రపంచ్ కప్ కోసం ఇప్పటికే 12 జట్లు తమ బెర్తులను ఖరారు చేస్తుకున్నాయి. ఆతిథ్యం ఇస్తున్న విండీస్, యూఎస్ఏ ప్లేస్ కన్ఫామ్ కాగా..2022 వరల్డ్ కప్ సూపర్- 8 జట్లు 2024 టోర్నీలో చోటు దక్కించుకున్నాయి. ఆ తర్వాత ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ఆధారంగా ఆప్గాన్, బంగ్లాదేశ్ జట్లు స్థానం సంపాదించుకున్నాయి. మిగిలన 8 స్థానాల కోసం రీజినల్ క్వాలిఫికేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు.