New gen Bajaj Pulsar P150 with an air cooled engine launched read specifications
mictv telugu

మరో కొత్త పల్సర్ స్పోర్ట్స్ బైక్..ధర ఎంతంటే..

November 23, 2022

 New gen Bajaj Pulsar P150 with an air cooled engine launched read specifications

యూత్‌లో బజాజ్ పల్సర్‌కి ఉన్న క్రేజ్ వేరు. మార్కెట్‌లో ఎన్ని బైక్‌లు వచ్చిన పల్సర్ బైక్‌లపై కుర్రకారుకి మక్కువ పోలేదు. యూత్‌తో పోటు ఫ్యామిలీ పర్సన్స్ కూడా పల్సర్ బైక్‌నే ఎంచుకుంటారు. దీంతో కొత్త కొత్త మోడల్స్ తో పలు బైక్‌లకు ఇప్పటికే బజాజ్ అందిస్తుంది. ఇప్పుడు మరో కొత్త పల్సర్‌ స్పోర్ట్స్‌ బైక్‌ను లాంచ్ చేసింది. పల్సర్ పీ 150ను ఆవిష్కరించింది. రేసింగ్ రెడ్‌, ఎబోనీ బ్లాక్‌ బ్లూ, ఎబోనీ బ్లాక్‌ వైట్‌, ఎబోనీ బ్లాక్‌ రెడ్‌, కరేబియన్‌ బ్లూ ఇలా మొత్తం 5 రంగుల్లో ఈ బైక్‌ను తీసుకొచ్చారు.

ఎల్‌ఈడీ డిఆర్‌ఎల్‌, ఎల్‌ఈడీ ప్రొజెక్టర్‌ హెడ్‌ల్యాంప్‌తో పాటు యూసీబీ ఛార్జింగ్ పోర్ట్‌ వంటి అధునాతన ఫీచర్లను ఈ బైక్‌లో అందించారు. డ్యూయల్‌ డిస్క్‌లు అందించి..సిట్టింగ్‌ను కొంచెం మార్చారు. వెనకాల సీట్ కాస్త హైట్‌ ఇచ్చి స్పోర్ట్స్‌ లుక్‌లో డిజైన్‌ చేశారు. 150 సీసీ బైక్ కు ఆదరణ దృష్ట్యా బజాజ్‌ ఈ బైక్‌ను తీసుకొచ్చింది. ఇక ఈ బైక్‌లో 149 సీసీ సింగిల్‌ సిలిండర్‌ ఇంజన్‌ను ఇచ్చారు. ఈ ఇంజన్‌ 8500 ఆర్‌పీఎమ్‌ వదర్ద 14.5 హెచ్‌పీని విడుదల చేస్తుంది. 14 లీటర్ల పెట్రోల్‌ కెపాసిటీ ఈ బైక్‌ సొంతం. బైక్‌ ధర విషయానికొస్తే.. సింగిల్‌-డిస్క్‌, సింగిల్‌ సీట్‌ కలిగిన బైక్‌ ధర రూ.1.16 లక్షలు కాగా, ట్విన్‌-డిస్క్‌, స్లిట్‌ సీట్‌ మోడల్‌ ధర రూ.1,19,757గా నిర్ణయించారు