డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్ ఆమె కాదట.. - MicTv.in - Telugu News
mictv telugu

డీజే టిల్లు సీక్వెల్‌లో హీరోయిన్ ఆమె కాదట..

July 4, 2022

‘డీజే టిల్లు’తో సంచలనం సృష్టించిన యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ.. త్వరలోనే ఆ సినిమాకు సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. కామెడీ రొమాంటిక్ థ్రిల్లర్ ఎంటర్‌టైనర్ గా వచ్చిన ఈ సినిమా సిద్ధు హీరోగా మాత్రమే కాకుండా కథ, డైలాగ్స్ రాశాడు. అతడి డైలాగ్స్, యాక్టింగ్ యూత్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. డీజే టిల్లు హిట్ తర్వాత సిద్ధును వెతుక్కుంటూ చాలా ఆఫర్లు వస్తున్నాయి. అందులో కొన్నింటికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. కానీ ఏమైందో తెలియదు.. ఉన్నట్టుండి అన్నింటి నుండి తప్పుకున్నాడు. దీనికి కారణం డీజే టిల్లు సీక్వెల్.

మరో విశేషమేంటంటే.. సీక్వెల్ కోసం సిద్ధు తొలిసారిగా మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. ఇంకో ట్విస్ట్ ఏంటంటే.. ఈ సీక్వెల్ లో హీరోయిన్ మొదటి భాగంలో నటించిన నేహాశెట్టి కాదు. ఇందులో ఆమె కేవలం అతిథి పాత్రలో కనిపిస్తుందట. పార్ట్ 2 లో ప్రస్తుతం ఓ క్రేజీ గ్లామర్ హీరోయిన్ కోసం టీమ్ అన్వేషిస్తున్నారు. మొదటి భాగంలో నటించిన కొన్ని పాత్రలు రెండో భాగంలోనూ కొనసాగుతాయి. ఇంకొన్ని పాత్రలు వచ్చి చేరతాయట. ఈ సినిమాను కూడా సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ వారే నిర్మించబోతున్నారు.