దేశంలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు - MicTv.in - Telugu News
mictv telugu

దేశంలో 80 లక్షలు దాటిన కరోనా కేసులు

October 29, 2020

positive

భారత్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత రెండు రోజులుగా 50 వేల లోపు కేసులు నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో 49,881 మంది కొత్తగా కరోనా వైరస్ బారిన బారినపడ్డారు. 9,58,116 పరీక్షలు చేయగా ఈ స్థాయిలో కేసులు నమోదయ్యాయి. అలాగే ఈ మహమ్మారి కారణంగా నిన్న  517 మంది ప్రాణాలు కోల్పోయారు. 

56,480 మంది కోలుకున్నారని కేంద్ర వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. దీంతో రికవరీ రేటు 90.23కి చేరింది. దేశవ్యాప్తంగా 80,40,203 మందికి వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. వారిలో 1,20,527 మంది ప్రాణాలు కోల్పోయారు. 73,15,989 మంది వ్యాధి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 6,03,687 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కేసుల సంఖ్యలో మహారాష్ట్ర మొదటి స్థానంలో కొనసాగుతూనే ఉంది.