యాదగిరిగుట్టలో సరికొత్త ప్రసాదం.. ధర ఎంతంటే? - MicTv.in - Telugu News
mictv telugu

యాదగిరిగుట్టలో సరికొత్త ప్రసాదం.. ధర ఎంతంటే?

May 15, 2019

తెలంగాణ  రాష్ట్రం ఏర్పాటైన తర్వాత యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర వైభవం మరింత పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం లక్షీనరసింహ స్వామి ఆలయాన్ని దినదినాభివృద్ధి చేస్తుంది. దీంతో ఆలయాన్ని సందర్శించి, స్వామి వారికి మొక్కులు చెల్లించుకునేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.

ఈ నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం ఆలయంలో నేటి నుంచి సరికొత్త ప్రసాదం అందుబాటులో తీసుకొచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ఎన్ గీతారెడ్డి పేర్కొన్నారు. బెల్లంపాకంతో, నిర్ణీత దిట్టంతో మూడు సార్లు లడ్డూలను ప్రయోగాత్మకంగా తయారు చేసి రుచి, నాణ్యతలను పరిశీలించి, కమిషనర్ ఆమోదం పొందిన తర్వాతే విక్రయాలు జరుపుతున్నామన్నారు. ఇన్నాళ్లు యాదాద్రిలో పంచారతో తయారు చేసిన 100 గ్రాముల బరువు లడ్డూలను ఒక్కోటి రూ.20లకు విక్రయించగా.. నేటి నుంచి బెల్లంతో తయారు చేసిన 100 గ్రాముల లడ్డూను రూ.25 లకు విక్రయిస్తున్నట్లు పేర్కొన్నారు.