ఏపీకి రావాలంటే ఇవి తప్పనిసరి : డీజీపీ - Telugu News - Mic tv
mictv telugu

ఏపీకి రావాలంటే ఇవి తప్పనిసరి : డీజీపీ

June 1, 2020

 

DGP

ఆంధ్రప్రదేశ్‌లోకి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారి కోసం కొన్ని మార్గదర్శకాలను విడుదల చేశారు. ఈ పాస్ ఉంటేనే వారిని అనుమతి ఇస్తామని డీజీపీ గౌతమ్ సవాంగ్ వెల్లడించారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో సరిహద్దు వద్ద తనిఖీలను మరింత ముమ్మరంగా, పటిష్టంగా చేస్తున్నామని అన్నారు. ఇతర రాష్ట్రల ప్రయాణాలకు కేంద్రం అనుమతి ఇవ్వడంతో ఈ నిబంధనలు మాత్రం తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాష్ట్రంలోపల తిరిగే వారికి ఎటువంటి ఆంక్షలు ఉండబోవని అన్నారు. 

ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న వారు తప్పని సరిగా ఏపీ పోలీసుల నుంచి ఈ పాస్ అనుమతి పొందాలి. ఆ తర్వాత సరిహద్దుల్లో వారికి కరోనా పరీక్షలు నిర్వహిస్తారు. వీటిలో నెగిటివ్ అని తేలితే వారం రోజులు హోం క్వారంటైన్ ఉండాలి. పాజిటివ్ వస్తే మాత్రం వెంటనే ఐసోలేషన్ కోసం కోవిడ్ ఆస్పత్రికి తరలిస్తారు. కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే వారు మాత్రం 7 రోజులు ఇనిస్టిట్యూషనల్ క్వారంటైన్‌లో ఉండి పరీక్షలు చేయించుకోవాలి. ప్రభుత్వం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఈ నిబంధనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. ప్రయాణికులు అన్ని జాగ్రత్తలు తీసుకొవాలని సూచించారు. ప్రతి ఒక్కరు మాస్కును విధిగా ధరించాలని డీజీపీ తెలిపారు.