'ఆర్ఆర్ఆర్‌'కు కొత్త అర్థం: కార్టూన్ - MicTv.in - Telugu News
mictv telugu

‘ఆర్ఆర్ఆర్‌’కు కొత్త అర్థం: కార్టూన్

March 25, 2022

rrr01

తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఇటీవలే ‘ఆర్ఆర్ఆర్’ టీం సభ్యులైనా దర్శకుడు రాజమౌళి, హీరోలు రాంచరణ్, జూ.ఎన్టీఆర్‌లు కలిసి టీఆర్ఎస్ ఎంపీ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా రాజమౌళి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ మొక్కలు నాటి సందడి చేశారు. అయితే, ఆ సందర్భాన్ని గుర్తు చేస్తూ… ప్రముఖ కార్టూనిస్ట్ మృత్యుంజయ్‌ ఓ అద్భుతమైన కార్టూన్ వేశారు. రాజమౌళి, చెర్రీ, తారక్ మొక్కలు పట్టుకుని నిల్చున్నట్లుగా కార్టూన్ చిత్రీకరించారు.

 

అంతేకాకుండా ‘ఆర్’ అనే అక్షరాలను హైలెట్ చేస్తూ ‘వృక్షో రక్షతి రక్షిత:’అని కొత్త నిర్వచనం ఇచ్చారు. ఈ కార్టూన్ చూసిన ఎంపీ సంతోష్‌కుమార్ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ.. దాన్ని తన ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. అనంతరం మంచి కార్టూన్ ద్వారా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌కు మద్దతు పలికినందుకు కార్టూనిస్ట్ మృత్యుంజయ్‌కి ధన్యవాదాలు తెలిపారు.

మరోపక్క ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం‘ఆర్ఆర్ఆర్’ సినిమా విడుదలై మంచి టాక్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. సినిమా కోసం ఫ్యాన్స్ తెల్లవారుజామునే థియేటర్లకు వెళ్లి క్యూ కట్టారు. అనంతరం రాజమౌళి టేకింగ్‌కి, రామ్‌చరణ్, ఎన్టీఆర్ యాక్టింగ్‌కి అభిమానులు నీరాజనాలు పలుకుతున్నారు. ఫస్ట్ షో నుంచే బ్లాక్‌బస్టర్ టాక్ రావడంతో మూడేళ్లుగా ఈ సినిమా కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్న మెగా, నందమూరి అభిమానులు పండగ చేసుకుంటున్నారు.