హాలీవుడ్‌లో సరికొత్త ప్రయోగం


బ్లాక్ అండ్ వైట్ తరం నుంచి యిప్పటి ఐమాక్స్ జెనరేషన్ వరకూ సినీపరిశ్రమలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ డిజిటల్ యుగంలో మార్పులు మరింత వేగవంతం అవుతున్నాయి. కథను చెప్పడంతో ఎంతో వైవిధ్యం కనిపిస్తోంది.

ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ సోడర్‌బర్గ్ చిత్రరంగంలో సినీకథనంలో మరో అద్భుత సాంకేతిక, సృజనాత్మక విధానానికి తెరతీశాడు. దీన్ని బ్రాంచింగ్ నేరేటివ్ అని పిలుస్తున్నాడు. దీని కోసంమొజాయిక్అనే చిత్రాన్ని ప్రత్యేకంగా తీశాడు సోడర్‌బర్గ్. యిదొక మర్డర్ మిస్టరీ. ఈ చిత్రాన్ని మనం చూడాలంటే ఓ ఫ్రీ యాప్‌ని డౌలోడ్ చేసుకోవాలి. దాంట్లో కథకు సంబంధించిన ఫస్ట్ ఎపిసోడ్ ప్లే చేసి చూడాలి. ఆ తర్వాత ఆ యాప్ మనకు కథలో మనకు పరిచయమైన వివిధ పాత్రల రూపంలో కొన్ని ఆప్షన్స్ యిస్తుంది. మనం ఏ పాత్ర పాయింట్ ఆఫ్ వ్యూ నుండి కథను తెలుసుకోవాలో నిర్ణయించుకుని ఆ ఆప్షన్ ఎంచుకుంటే ఆ పాత్ర దృష్టికోణం నుంచి సినిమా చూస్తాం. అలా ప్రతీ పాత్ర కథలో ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరిస్తుంది. ప్రముఖ హాలీవుడ్ మీడియా సంస్థ HBO కోసం స్టీవెన్ సోడర్‌బర్గ్ చేస్తున్న ఈ ప్రయోగం ప్రపంచ సినిమా రంగం మీద ఎలాంటి ప్రభావం చూపబోతోందో తెలుసుకోవాలంటే నవంబర్ దాకా ఆగాల్సిందే.

SHARE