వచ్చేవారం అదిరిపోయే కొత్త మొబైల్స్ వచ్చేస్తున్నాయి. - MicTv.in - Telugu News
mictv telugu

వచ్చేవారం అదిరిపోయే కొత్త మొబైల్స్ వచ్చేస్తున్నాయి.

November 27, 2022

కొత్త మొబైల్ కొనే ఆలోచనలో ఉన్నారా ? అయితే ఓ వారం రోజులు ఆగండి. మార్కెట్‌లోకి కొత్త మొబైల్స్ వస్తున్నాయి. అద్భుతమైన ఫీచర్స్‌‌తో, బడ్జెట్ ధరకే లభించనున్నాయి. మిడ్ రేంజ్, ప్రీమియం ఫోన్లు అందుబాటులోకి వస్తున్నాయి. ఐకూ కంపెనీ నుంచి రెండు కొత్త ఫోన్లతో పాటు ఇన్‌ఫినిక్స్ కంపెనీ కూడా కొత్త మొబైళ్లను మార్కెట్‌లోకి తీసుకొస్తుంది. వాటిని కూడా పరిశీలించి మీకు కావలసి ఫోన్‌ను తీసుకోవచ్చు.

వచ్చే వారం వచ్చే కొత్త మొబైల్స్ ఇవే..

*ఐకూ నియో 7 ఎస్ఈ ఫోన్‌ డిసెంబర్ 2న మార్కెట్‌లోకి రానుంది. ఈ ఫోన్‌లో 6.78 అంగుళాల డిస్ ప్లే ,64 మెగా పిక్సల్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా,120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, వంటి ఫీచర్ల ఉండనున్నాయి. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ కూడా ఉండొచ్చు. ఇంకా ఈ ఫోన్‌లో 8200 మీడియాటెక్ డెమెన్‌సిటీ 8200 ప్రాసెసర్ ఉండనుంది.

* ఐకూ 11 సీరిస్ కూడా మార్కెట్లోకి వస్తుంది. చైనా, మలేసియాలో ఈ కొత్త ఫోన్లను డిసెంబర్ 2న లాంచ్ చేయనున్నారు. ఐకూ 11, ఐకూ 11 ప్రో ఫోన్లు మార్కెట్‌లోకి రావొచ్చు. వీటిల్లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 2 ప్రాసెసర్ ఉండనుంది. ఇంకా 6.78 అంగుళాల కర్వ్‌డ్ ఎడ్జ్ డిస్‌ప్లే, 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 50 ఎంపీ కెమెరా వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

*అలాగే ఇన్‌ఫినిక్స్ కంపెనీ నుంచి ఇన్‌ఫినిక్స్ హాట్ 20 5జీ పేరుతో కొత్త ఫోన్ లాంచ్ చేయడానికి రెడీ అవుతోంది. డిసెంబర్ 1న ఈ ఫోన్ మార్కెట్‌లోకి రానుంది. ఈ 5జీ ఫోన్‌లో 6.6 అంగుళాల స్క్రీన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, 50 ఎంపీ కెమెరా, మీడియాటెక్ డిమెన్‌సిటీ 810 ప్రాసెసర్, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉండనున్నాయి.

*ఇకపోతే ఇన్‌ఫినిక్స్ హాట్ 20 ప్లే విషయానికి వస్తే.. ఇందులో 6.82 అంగుళాల స్క్రీన్, మీడియాటెక్ హీలియో జీ37 ప్రాసెర్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 13 ఎంపీ కెమెరా, 6.82 అంగుళాల స్క్రీన్ వంటి ఫీచర్లు ఉండొచ్చు.