కొత్త సిత్రం షూటింగ్ షురూ.. - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త సిత్రం షూటింగ్ షురూ..

November 20, 2017

సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ – నాగార్జున క్రేజీ కాంబినేషన్‌లో కొత్త సినిమా షూటింగ్ మొదలయ్యింది. సోమవారం అన్నపూర్ణ స్టూడియోస్ లో షూటింగ్ ప్రారంభించారు. నాగ్, వర్మ మాట్లాడారు. వర్మ కంపెనీ నిర్మాణంలో ఇది రూపొందుతోంది. 28 ఏళ్ళ క్రితం వచ్చిన శివ సినిమాకు ఈ సినిమా సీక్వెలా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎప్పట్నించో వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తోందనే పుకార్లకు ఫుల్‌స్టాప్ పడింది. ఈ విషయాన్ని అక్కినేని నాగార్జున తన ట్విట్టర్ ద్వారా వెలిబుచ్చారు. ‘ 28 ఏళ్ళ క్రితం శివ సినిమా నా జీవితాన్నే మార్చేసింది. అది మాటల్లో వర్ణించలేని అనుభూతి. జీవితంలో ప్రతీరోజూ కొత్త అనుభవాలతో ముందుకు సాగాలని కోరుకుంటున్నా ’ అని పేర్కొన్నాడు. ఎన్నో ప్రాధాన్యతలు సంతరించుకున్న ఈ చిత్రంలో బిగ్‌బీ అమితాబ్ బచ్చన్ కూడా నటిస్తున్నట్టు సమాచారం. ఆ శివలో నాగార్జున స్టూడెంట్ పాత్ర పోషిస్తే ఈ శివలో పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం.