new pay commission modi government in parliament
mictv telugu

ఉద్యోగుల ఆశలపై కేంద్రం నీళ్లు… ఆ ఆలోచన లేదట!

August 9, 2022

కేం‍ద్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆశలపై మోదీ సర్కారు నీళ్లు చల్లింది. జీతాల పెంపు కోసం 8వ వేతన సవరణ సంఘాన్ని ఇప్పట్లో ఏర్పాటు చేసే ఆలోచన ఇప్పట్లో లేదని స్పష్టం చేసింది. ఈమేరకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. ‘కొత్త వేతన సంఘం ఏర్పాటు ఆలోచన లేదు. 7వ వేతన సవరణ సంఘం సిఫార్సులు ఇంకా పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అయితే జీతాలను పెంచడానికి ప్రతి 6 నెలలకు ఒకసారి డీఏను సవరిస్తూనే ఉన్నాం..’ అని ఆయన ఓ ప్రశ్నలకు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.

ధరల పెరుగుదల, పన్నుపోట్లు వంటి వాటివల్ల జీతం పెంచాలని ఉద్యోగులు కోరుతున్నారు. వేతన సవరణ సంఘాన్ని వేస్తే ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్లు జీతం వస్తుందని ఆశిస్తున్నారు. కేంద్రం మాత్రం డీఏ పెంపుతో సరిపెట్టాలని చూస్తోందనే అనుమానాలు వస్తున్నాయి. 34 శాతంగా ఉన్న డీఏ త్వరలో 3% నుంచి 4% మధ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం.