New pensions from today..District wise details are as follows..
mictv telugu

నేటి నుంచే కొత్త పింఛన్లు..జిల్లాల వారీగా వివరాలు ఇవే..

August 15, 2022

New pensions from today..District wise details are as follows..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఆయా జిల్లాల్లో అర్హులైనా పది లక్షల మందికి కొత్తగా ఆసరా పింఛన్లు మంజూరు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ కార్యక్రమం నేటి నుంచే ప్రారంభంకానుంది. ఇప్పటికే ఆయా జిల్లాలకు కొత్త కార్డులను అధికారులు తరలించారు. వీటిని రాష్ట్రమంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక ప్రజాప్రతినిధులు స్వయంగా నూతన లబ్ధిదారులకు పంపిణీ చేయడానికి సిద్దమైయ్యారు.

ఈ కార్యక్రమం స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా పంద్రాగస్టు రోజున మొదలై, ఈ నెల చివరి వరకు కొనసాగనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. లబ్ధిదారులకు ఆసరా పింఛన్లతోపాటు, ఆసరా కార్డులను కూడా పంపిణీ చేస్తామని తెలిపారు. ఈ క్రమంలో  కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల కొత్త లబ్దిదారులు ఆనందాన్ని వ్యక్తం చేస్తూ, ధన్యవాదాలు తెలియజేశారు.

ఇక, ఈ ఆసరా పింఛన్ల అర్హత విషయానికొస్తే.. ”వయోపరిమితిని 65 ఏండ్ల నుంచి 57 ఏండ్లకు తగ్గిస్తూ, కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 9,46,117 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం 35.95 లక్షల మందికి ఆసరా పింఛన్లు అందుతుండగా, కొత్తవారితో కలిపి ఈ సంఖ్య 45.41 లక్షలకు పెరిగింది. రాష్ట్రంలోని అర్హులైన వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, పైలేరియా, హెచ్‌ఐవీ రోగులు, బీడీ కార్మికులు, నేత, గీత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెలా ఆసరా పింఛన్లు అందజేస్తుంది.

తాజాగా డయాలసిస్‌ పేషెంట్లకు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. దీంతో ఆ క్యాటగిరీకి చెందిన దాదాపు 12 వేల మంది లబ్ధిపొందనున్నారు. దీంతో ఆసరా పెన్షన్లు పొందుతున్న క్యాటగిరీల సంఖ్య పదికి చేరింది. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులకు నెలకు రూ.3,016, వృద్ధులు, వితంతువులు, ఇతర క్యాటగిరీల వారికి నెలకు రూ.2,016 చొప్పున పింఛన్లు పంపిణీ చేస్తున్నది. ఇందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం దాదాపుగా రూ.12 వేల కోట్ల వరకు వెచ్చిస్తుంది” అని అధికారులు వివరాలను వెల్లడించారు.

జిల్లాల వారీగా మంజూరైన కొత్త పింఛన్ల వివరాలు ఇవే..

New pensions from today..District wise details are as follows..