ఢిల్లీ అల్లర్లు.. సిటీకి కొత్త కమిషనర్, ముష్కరులకు చెక్ - MicTv.in - Telugu News
mictv telugu

ఢిల్లీ అల్లర్లు.. సిటీకి కొత్త కమిషనర్, ముష్కరులకు చెక్

February 28, 2020

cbvc

సీఏఏ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య ఘర్షణలతో నెత్తురోడుతున్న ఢిల్లీకి కొత్త పోలీస్ బాస్ వచ్చాడు. ఇండియన్ ముజాహిదీన్ తోపాటు పలు ఉగ్రవాద కేసులో కఠినంగా వ్యవహరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్ఎన్ శ్రీవాస్తవ కొత్త నూతన పోలీస్‌ కమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రస్తుత కమిషనర్‌ అమూల్య పట్నాయక్‌ రేపు పదవీ విరమణ చేయనుండడంతో కేంద్రం శ్రీవాస్తవను తీసుకొచ్చింది. సీఆర్పీఎఫ్ నుంచి ఇటీవలే ఢిల్లీ పోలీస్ విభాగంలో స్పెషల్ డైరెక్టర్ జనరల్‌‌గా బాధ్యతలు చేపట్టిన ఆయన అల్లర్లకు చెక్ పెడతారని భావిస్తున్నారు.

38 మందిని బలితీసుకున్న ఢిల్లీలో ఘర్షణలను ప్రస్తుతానికి తగ్గుముఖం పట్టాయి. ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో ముష్కరులు వెనక్కి తగ్గుతున్నారు. ఢిల్లీ -ఘజియాబాద్ సరిహద్దుల్లో  కేంద్రం భారీ సంఖ్యలో సాయుధ పోలీసు బలగాలను రంగంలోకి దింపింది.