ఏపీలో కొత్త రాజకీయ పార్టీ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో కొత్త రాజకీయ పార్టీ

April 13, 2022

fdbhdffdbdvb

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మరో కొత్త పార్టీ రాబోతోంది. రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా కొత్త రాజకీయ పార్టీ ప్రకటిస్తున్నట్టు జైభీమ్ యాక్సెస్ జస్టిస్ వ్యవస్థాపకులు జడ శ్రావణ్ కుమార్ వెల్లడించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో అట్టడుగు వర్గాలపై దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను ఇతర పథకాలకు మళ్లించి, బడుగు, బలహీన వర్గాలను మోసం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజన, దళితులకు కనీస మౌలిక వసతులు కల్పించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వ్యాఖ్యానించారు.