ఏపీలో సినిమా టిక్కెట్లకు కొత్త ధరలు... జీవో జారీ - MicTv.in - Telugu News
mictv telugu

ఏపీలో సినిమా టిక్కెట్లకు కొత్త ధరలు… జీవో జారీ

March 8, 2022

06

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సినిమా టిక్కెట్లకు కొత్త ధరలను నిర్ణయిస్తూ సోమవారం జీవో జారీ చేసింది.
కొత్త ధరల ప్రకారం సినిమా థియేటర్లలో కనిష్ట ధర రూ. 20, గరిష్ట ధర రూ. 250 గా నిర్ణయించారు.
గ్రామ, పట్టణ, నగర స్థాయిల్లో ఉండే థియేటర్లను బట్టి టిక్కెట్ రేట్లను విభజించారు.

*మున్సిపల్ కార్పొరేషన్‌లలో టిక్కెట్ ధరలు ఇలా…

-నాన్ ఏసీ థియేటర్లు – ప్రీమియం టిక్కెట్ రూ.60, నాన్ ప్రీమియం రూ. 40
-ఏసీ థియేటర్లు – ప్రీమియం రూ. 100, నాన్ ప్రీమియం రూ. 70
-స్పెషల్ థియేటర్లు – ప్రీమియం రూ. 125, నాన్ ప్రీమియం రూ. 100
-మల్టీప్లెక్సులు – రెగ్యులర్ సీట్ రూ. 150, రిక్లయినరీ సీట్ రూ. 250

*మున్సిపాలిటీలు…
-నాన్ ఏసీ థియేటర్లు – ప్రీమియం టిక్కెట్ రూ. 50, నాన్ ప్రీమియం టిక్కెట్ రూ. 30
-ఏసీ థియేటర్లు – ప్రీమియం రూ. 80, నాన్ ప్రీమియం రూ. 60
-స్పెషల్ థియేటర్లు – ప్రీమియం రూ. 100, నాన్ ప్రీమియం రూ. 80
-మల్టీప్లెక్సులు – రెగ్యులర్ సీట్ రూ. 125, రిక్లయినరీ సీట్ రూ. 250

*నగర పంచాయితీ, గ్రామ పంచాయితీలలో ఇలా…
-నాన్ ఏసీ థియేటర్లు – ప్రీమియం టిక్కెట్ రూ. 40, నాన్ ప్రీమియం టిక్కెట్ రూ. 20
-ఏసీ థియేటర్లు – ప్రీమియం రూ. 70, నాన్ ప్రీమియం రూ. 50
-స్పెషల్ థియేటర్లు – ప్రీమియం రూ. 90, నాన్ ప్రీమియం రూ. 70
-మల్టీప్లెక్సులు – రెగ్యులర్ సీట్ రూ. 100, రిక్లయినరీ సీట్ రూ. 250.

వీటితో పాటు జీఎస్టీ అదనం. మరోవైపు వంద కోట్లకు పైబడి ఖర్చుతో నిర్మితమయ్యే చిత్రాలకు మొదటి పది రోజులు రేట్లను పెంచుకునే వెసులుబాటు కల్పించారు. కానీ ఒక షరతు ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో 20 శాతం చిత్రీకరణ జరుపుకున్న చిత్రాలకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే, చిన్న సినిమాలకు ఊరటగా వాటికి ఐదో ఆట వేసుకునేందుకు
అనుమతినిచ్చింది.