కేసీఆర్ పేరుతో కొత్త పథకం.. యువత కోసం.. - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ పేరుతో కొత్త పథకం.. యువత కోసం..

February 27, 2020

KCR Apathbandhu.

రాష్ట్రంలో మరో ప్రజా సంక్షేమ పథకం ముఖ్యమంత్రి కేసీఆర్ పేరుతో ప్రవేశ పెట్టునున్నట్టు  రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌ వెల్లడించారు. కేసీఆర్ ఆపద్బంధు పేరిట ఈ పథకాన్ని ప్రారంభించాలని బీసీ సంక్షేమ శాఖ నిర్ణయించింది అని అన్నారు. గురువారం ఆయన అన్ని జిల్లాల బీసీ సంక్షేమ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 

ఈ సందర్భంగా మంత్రి గంగుల మాట్లాడుతూ.. కేసీఆర్ ఆపద్బంధు పథకం కింద చదువుకున్న నిరుద్యోగ యువతులకు నిఫ్ట్‌ ద్వారా శిక్షణ, ఉపాధి కల్పించనున్నట్లు చెప్పారు. ‘ఎంబీసీ కార్పొరేషన్‌ ద్వారా యువతకు అంబులెన్స్‌లు అందజేయనున్నాం. ఐదుగురు యువతకు ఒక గ్రూప్‌గా అంబులెన్స్‌ ఇవ్వనున్నాం. పైలెట్‌ ప్రాజెక్ట్‌ కింద జిల్లాకొక అంబులెన్స్‌ను కేటాయించనున్నాం. అలాగే మరో పథకంలో మహిళలకు మేలు చేకూరేలా 10 వేల మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేస్తాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల అనంతరం పథకాలు అమలు చేస్తాం. చదువుకున్న నిరుద్యోగ యువతులకు నిఫ్ట్‌ ద్వారా శిక్షణ ఇచ్చి, ఉపాధి కల్పించనున్నాం. 11 సమాఖ్యల ద్వారా వివిధ వృత్తుల వారికి ఆయా రంగాల్లో ఉపాధి కల్పిస్తాం. సంక్షేమ వసతి గృహాల ప్రగతి కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించనున్నాం’ అని మంత్రి వెల్లడించారు.