నయా దొంగలండీ సామీ... పారాహుషార్ ! - MicTv.in - Telugu News
mictv telugu

నయా దొంగలండీ సామీ… పారాహుషార్ !

August 2, 2017

బతకడానికి వెయ్యి మార్గాల్లో సింపతీతో బతికడం కూడా ఆ మార్గాల్లో యాడ్ అయింది. ఇదొక భిన్నమైర తరీఖ. అలా దేశంలో దోచుకునేవారు ఎక్కువారెక్కువయ్యారు. సందు దొరికితే చాలా నిలువుదోపిడీ చేస్తున్న ఖిలాడీలు కోకొల్లలు. ఈ మధ్య చదువుకున్న పోష్ దొంగలు, భక్తిని అడ్డు పెట్టుకొని దోచుకునేవారు, సింపతీతో బరికేవారు, కొందరు మరీ విచిత్రంగా మన మధ్యే కామన్ మేన్ లలా వుంటూ పర్సులు, నగలను స్వాహా చేస్తున్నారు. దొరల రూపంలో వున్న దొంగలు ఎక్కువయ్యారు. ఇలాంటి అనుభవాలిప్పుడు నగరాల్లో, వూళ్ళల్లో కూడా ఎక్కువయ్యాయి. మోసపోయిన వాడు మోసపోతూనే వున్నాడు, మోసం చేసేవాడు మోసం చేస్తూనే వున్నాడు. ఈ ప్రహసనం ఆగదు.

ఎందుకు ఆగదంటే కారణాలు ఎదుటివాడు జల్సాలకు అలవాటు పడో ? లేకపోతే పని చెయ్యడానికి ఒళ్ళు వంగకపోవడమో వంటివి ప్రధానంగా చెప్పొచ్చు. భిక్షగాళ్ళు దేహీ అని చేయి చాస్తున్నారు. వాళ్ళను బేస్ చేస్కొని కొత్తగా కొందరు నయా అవతార్ లలో వేరే మార్గంలో చేతులు చాచకుండానే ఢాంఫట్ చేసేస్తున్నారు ? అలాంటి నాటీ దొంగల గురించి ఒక నజర్ తెలుసుకుందామా…

యోయో దొంగలు

హైదరాబాదు నగరంలో ఇలాంటివాళ్ళు చాలా ఎక్కువయ్యారిప్పుడు. అతను చూడటానికి యోయోలానే పోష్ గా వుంటాడు. డ్రస్సింగ్ సెన్స్ కూడా చాలా నీట్ గా వుంటుంది. మనల్ని దూరం నుండి వీడైతే మనకు వర్కౌట్ అవుతుండొచ్చని స్కాన్ చేస్తాడు. దగ్గరికొచ్చి ‘ ఎక్స్ క్యూజ్ మీ సర్.. నా పర్స్ పోయింది. నేను తిరుపతి వెళ్ళాలి. డబ్బుల్లేవు. ఇంత వరకు ఏమీ తినలేదు. ఇఫ్ యూ డోంట్ మైండ్ ఒక హండ్రెడ్ రూపీస్ వుంటే ఇస్తారా ? ’ అని ఎంత సౌమ్యంగా అడుగుతాడో. దయగల్ల మారాజాలు మరో ఆలోచనకు ఆస్కారం లేకుండా వెంటనే పర్సులోంచి వంద తీసి ఇచ్చేస్తారు. అతని గెటప్ అలా ఎదుటివాణ్ని మాయ చేసేస్తుంది. ఇంకొందరు నేను హాస్పిటల్ కు వెళ్తూ నా పర్సు పోగొట్టుకున్నాను. మందులకు డబ్బుల్లేవు ప్లీజ్ హెల్ప్ మీ అంటాడు. హాస్పిటల్ అనగానే చాలా మంది వెంటనే కరిగిపోయి తమ దగ్గరున్నంతా ఇచ్చేస్తారు. ఇదో రకం యోయో స్ట్రాటజీ. ఇలా వాళ్ళు కొన్ని స్పాట్లలో పోష్ గా అడుక్కుంటూ రోజులో ఎటు లేదన్నా వెయ్యి నుండి పదిహేను వందల వరకు సంపాదించుకుంటున్నారు.
అలాగే కొందరు లేడీలు కూడా నా డబ్బులు పోయాయని బస్టాండుల్లోని ప్రయాణీకులను టార్గెట్ చేస్తారు.

‘ నేను హైదరాబాదు వెళ్ళాలి లేదా తిరుపతి వెళ్ళాలి ’ అని అబద్ధాలు చెప్పి వందల్లో అడుక్కుంటుంటారు. అలా వాళ్ళు బస్టాండులో వచ్చీపోయే ప్రయాణీకుల దగ్గర డబ్బులు అడుక్కుంటూ పబ్బం గడిపేస్తుంటారు.

భక్తి దొంగలు

వీళ్ళు చాలా డిఫరెంటు. చూడ్డానికి తలకు టోపీ పెట్టుకొని, ఐదుసార్లు నమాజ్ చేసే వ్యక్తుల్లానే వుంటారు. హెవీ ట్రాఫిక్ సిగ్నల్స్ వీళ్ళ స్పాట్ లని చెప్పొచ్చు. బైకుల మీద వచ్చేవాళ్ళకు ఎదురెళ్ళి లిఫ్ట్ అడుగుతారు. అయ్యో పాపం అంటూ లిఫ్ట్ ఇచ్చేవారున్నారు. పోనీలే మనమేం లిఫ్ట్ ఇస్తాం అని వెళ్ళిపోయేవారున్నారు. మొదటిరకం వారు లిఫ్ట్ ఇవ్వగానే వెనక కూర్చున్నతను ఇక మనం ఏమీ అడక్కుండానే తన కష్టాల చిట్టా చకచకా పాఠంలా చదివేస్తుంటాడు. ‘ నాకు ముగ్గురు కూతుళ్ళు, ఒకమ్మాయి జైల్లో వుంది. ఇద్దరమ్మాయిల్లో ఒకమ్మాయి కుంటిది. తినడానికి ఇంట్లో గాసం లేక నా ఫ్రెండు దగ్గర డబ్బులు అప్పుగా అడుక్కోవడానికి వెళ్తాన్నా.

కానీ వాడి పోన్ స్విచ్ఛాఫ్ వస్తోంది. ఇప్పుడు బియ్యం లేకపోతే ఇంట్లో అందరం ఉపవాసం వుండాలంటాడు ’. ఒకచోట బైకు ఆపమని చెప్పి ధీనంగా ముఖం పెట్టి వంద రూపాయలు ఉంటే ఇవ్వండి ఈ పూట గడుస్తుంది. అల్లా నిన్ను చల్లగా చూస్తాడని అంటాడు. జాలి హృదయం గలవారు తప్పకుండా అతనికి వంద రూపాయలు ఇవ్వాల్సిందే. అలా అతను సిటీ మొత్తంగా లిఫ్టులడుగుతూ అందరికీ తన ధీన గాథలు చెప్పుకుంటూ డబ్బులు అడుక్కుంటూనే వుంటాడు. అతని పనే అదింక. తీరా సాయంత్రం చూస్తే అతను బార్లో దర్జాగా కూర్చొని బీర్లు తాగుతుంటాడు !?

సో.. ఇలా పరోక్షంగా దోచుకుంటున్న దొంగలు ఎక్కువయ్యారు ఎక్కడైనా. ముఖ్యంగా నగరాల్లో చాలా మంది తయారయ్యారు ఇలాంటివారు. భిక్షగాడిలా అవతారమెత్తడం ఎందుకూ జనాలను వెర్రిగా నమ్మించి ఇలా ఎంచక్కా దొరబాబుల్లా దోచుకోవచ్చనుకుంటున్నారు చాలా మంది. పని చేస్కొని బతకడానికి చేతకాక ఇలాంటి వక్ర మార్గాల్లో పయనిస్తున్నది మరీ ముఖ్యంగా యువతే వుండటం గమనార్హం. బాగా చదువుకొని కూడా ఇలాంటి మార్గాలను ఎంచుకుంటున్నారు ఎందుకో మరి ?

ఇలాంటివాళ్ళు చాలా రకాల మార్గాల్లో జనాలను వెర్రివాళ్ళను చేసి దోచుకుంటున్నారు. చైన్ స్నాచింగులు, బ్యాంకు రాబరీలు ప్రత్యక్షంగా జరుగుతుంటే పరోక్షంగా ఇలాంటివి కూడా ఇప్పుడు కొందరికి ఫ్యాషన్ లా జరుగుతున్నాయి !? ఆన్ లైన్ లో కూడా ఈ మధ్య మనం చాలా మోసాలను చూస్తున్నాం. ఇలాంటి మోసాలను తెలుసుకొని జనాలు అలర్టవుతారు. అప్పుడు నిజంగా కష్టం ఎదరైనవాడు అడుక్కున్నా నమ్మి అతనికి సాయం చెయ్యటానికి జనాలు సంశయిస్తారు ? నమ్మకం అనేది నెమ్మదిగా పోతుంటుంది. ఒకరి దిగజారుడుతనం వల్ల మనుషుల్లో వున్న నమ్మకం అనేది పూర్తిగా పోయాక మనిషికి మనిషి సాయం చేసుకునే గొప్ప సాంప్రదాయం సర్వనాశనం అవుతుంది ??? అందుకే చదువున్నకున్న వాళ్ళు కాస్త ఇలాంటివి తెలుసుకొని మసలుకుంటే బావుంటుందేమో. సామీ.. నయా దొంగలండీ సామీ.. పారాహుషార్ !!