కొత్త రూల్ : డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ - MicTv.in - Telugu News
mictv telugu

కొత్త రూల్ : డ్రైవింగ్ టెస్టు లేకుండానే లైసెన్స్ జారీ

May 5, 2022

డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం ఆర్టీఏ ఆఫీసుకు వెళ్లి దరఖాస్తు చేయాలి. స్లాట్ ప్రకారం డ్రైవింగ్ టెస్టుకు హాజరవ్వాలి. ఆ తర్వాత లైసెన్సును పోస్టు ద్వారా ఇంటి చిరునామాకు పంపిస్తారు. ఇప్పుడీ కష్టాలకు చెక్ పెడుతున్నారు. లైసెన్సుల జారీ, డ్రైవింగ్ ట్రైనింగ్ కేంద్రాలకు ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. ఈ నిబంధనలు జులై 1 నుంచి అమల్లోకి రానున్నాయి. దేశ వ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో రవాణా శాఖలు, కేంద్రం పరిధిలో డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలు రానున్నాయి. ఐదేళ్ల కాలపరిమితి ఉండే వీటిలో శిక్షణ పూర్తి చేసుకొన్నవారికి ఆయా సంస్థలే ఇక నుంచి లైసెన్సులు జారీ చేస్తాయి. వాటిపై ఆయా సంస్థల చిరునామా ఉంటుంది. ఇదికాక, ప్రైవేటు డ్రైవింగ్ శిక్షణా కేంద్రాలకు ప్రభుత్వం కొత్త నిబంధనలు విధించింది. అవి

ప్రైవేట్ డ్రైవింగ్ కేంద్రాలకు నియమాలు
టూవీలర్, ఫోర్ వీలర్ వాహనాల శిక్షణ కోసం కనీసం ఎకరా స్థలం ఉండాలి.
భారీ వాహనాల శిక్షణ కోసం రెండెకరాల స్థలం ఉండాలి.
శిక్షణ ఇచ్చేవారికి డిప్లమాతో పాటు కనీసం ఐదేళ్ల డ్రైవింగ్ అనుభవం ఉండాలి.
శిక్షణా కేంద్రం నాణ్యమైన డ్రైవింగ్ ట్రాక్ కలిగి ఉండాలి
స్టిమ్యులేటర్, టెస్ట్ ట్రాక్ ఉండాలి.
లైట్ వెహికిల్స్‌కి శిక్షణా సమయం కనిష్టంగా 29 గంటలు ( 8 గంటల థియరీ, 21 గంటల ప్రాక్టికల్స్) గరిష్టంగా 4 వారాలు ఉండాలి
మధ్యస్థ, భారీ వాహనాలకు కనిష్టంగా 38 గంటలు ( 8 గంటల థియరీ, 31 గంటల ప్రాక్టికల్స్) ఉండాలి. గరిష్టంగా ఆరు వారాలుండాలి
లైసెన్సుకు అవసరమయ్యే పత్రాలు
డేటాఫ్ బర్త్/ పాస్‌పోర్ట్/ పాన్ కార్డ్
రేషన్ కార్డ్/పాస్ పోర్ట్/ ఆధార్ కార్డ్
పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో
ఫారం 1, 1A