ఏపీలో కొత్త పింఛన్లు కావాలంటే గతంలోలా కాదు. ఇప్పుడు రూల్స్ మారిపోయాయి. గతంలో ప్రతీనెలా కొత్త పింఛన్లను మంజూరు చేయగా, తాజాగా ఆరు నెలలకోసారి మాత్రమే ఇస్తున్నారు.
ఇదికాక, కొత్త పెన్షన్ మంజూరు కోసం దరఖాస్తుతో పాటు కొత్తగా మరిన్ని ధృవీకరణ పత్రాలు కావాలని మెలిక పెట్టారు. ఇంతకు ముందు ఆధార్ కార్డు, రేషన్ కార్డు జిరాక్స్ కాపీలుంటే సరిపోయేది. కానీ, ఇప్పుడు వాటితో పాటు ఆదాయ, కుల ధృవీకరణ పత్రాలు, ఆధార్ హిస్టరీ పత్రాలు కావాలని చెప్తున్నారు. వీటి కోసం కార్యాలయాల చుట్టూ తిరగడానికే సరిపోతోందని బాధితులు వాపోతున్నారు. వీటికి అదనంగా కరెంటు బిల్లు, ఇంటి పన్ను బిల్లు కూడా అడుగుతున్నారు.