మార్చి 26 నుంచి ప్రారంభమయ్యే ఐపీఎల్ 15వ సీజన్లో బీసీసీఐ కొన్ని నిబంధనలను కొత్తగా చేర్చింది. కోవిడ్, డీఆర్ఎస్, స్ట్రైకింగ్ వంటి విషయాల్లో అమలు చేయాల్సిన కొన్ని విషయాలను ప్రకటించింది. అవేంటంటే..
1. జట్టులోని 12 మంది ప్లేయర్లలో కరోనా సోకి మ్యాచ్కు అందుబాటులో లేనప్పుడు ఆ మ్యాచును రీషెడ్యూల్ చేయవచ్చు. రీషెడ్యూల్ సాధ్యం కాకపోతే ఐపీఎల్ టెక్నికల్ టీం ఏం చేయాలనే దానిపై తుది నిర్ణయం తీసుకుంటారు.
2. ప్రతీ ఇన్నింగ్స్లో రెండు రివ్యూలు కోరేందుకు అనుమతి. ఇంతకు ముందు ఒక్క రివ్యూకే అవకాశం ఉండేది.
3. ఎవరైనా బ్యాటర్ క్యాచ్ అవుట్ అయినప్పుడు క్రీజులోకి వచ్చే ఆటగాడే స్ట్రైకింగ్ తీసుకోవాలి. ఈ నిబంధనను ఇటీవల మెల్బోర్న్ క్రికెట్ క్లబ్లో అమలు చేశారు.
4. ప్లే ఆఫ్స్ లేదా ఫైనల్ లాంటి కీలక మ్యాచుల్లో టైగా మారితే.. నిర్ణీత సమయంలో సూపర్ ఓవర్ నిర్వహిస్తారు. ఒకవేళ సాధ్యం కాని పక్షంలో లీగ్ స్టేజ్లో టాప్ పాయింట్లు ఉన్న జట్టును విజేతగా ప్రకటిస్తారు.