తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్: సీపీ రంగనాథ్ - MicTv.in - Telugu News
mictv telugu

తెలంగాణలో ఏప్రిల్ నుంచి కొత్త రూల్స్: సీపీ రంగనాథ్

March 25, 2022

kf

తెలంగాణ రాష్ట్రంలో ఏప్రిల్ 1వ తేదీనుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్‌ను అమలు చేస్తామని శుక్రవారం హైదరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..”ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే చార్జిషీట్లు వేస్తాం. కరోనా కారణంగా గ్యాప్ ఇచ్చాం. కానీ ఇకనుంచి ట్రాఫిక్ రూల్స్ అతిక్రమిస్తే మునుపటి లాగే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపుతాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా స్పీడ్ లిమిట్ ఒకేలా ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం.

త్వరలోనే స్పీడ్ లిమిట్ విధానం అమల్లోకి తెస్తాం. ఇకపై డ్రంక్ అండ్ డ్రైవ్‌పై కఠిన చర్యలు ఉంటాయి. తాగి వాహనం నడిపేతే జైలుకు పంపిస్తాం. వాహనాల అద్దాలపై స్థాయిని మెన్షన్ చేస్తూ స్టిక్కర్స్ అంటించకూడదు. సుప్రీంకోర్టు గైడ్ లెన్స్ తప్పనిసరిగా పాటించాలి” అని ఆయన తెలిపారు.

మరోపక్క ఇటీవలే తెలంగాణలో పెండింగ్లో ఉన్న ఛలాన్లపై పోలీస్ శాఖ బంఫర్ ఆఫర్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, రాష్ట్ర వ్యాప్తంగా అనూహ్య స్పందన లభించింది. 650 కోట్ల రూపాయలకు పైగా విలువైన పెండింగ్ ఛలాన్లు క్లియర్ అయ్యాయని సీపీ రంగనాథ్ తెలిపారు. రాయితీ పోయి, 190 కోట్లు వసూలైనట్లు తెలిపారు. ఇప్పటి వరకు కోటి 85 లక్షల ఛలాన్లు క్లియర్ చేశారని.. రోజుకు ఏడు నుండి పది లక్షల పెండింగ్ చలాన్లను చెల్లిస్తున్నట్లు రంగనాథ్ వెల్లడించారు.